ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్ కు చెందిన అనుపురం హరీష్ (29) అనే గీతకార్మికుడు శుక్రవారం రాత్రి సుమారు 07 గంటల సమయం లో ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం హరీష్ కల్లు తీయడానికి తాటిచెట్టు పైకి వెళ్ళాడు. చెట్టు పై వరకు వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు కాలు జారీ క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఆరునెలల కడుపుతో వుంది, కల్లు అమ్ముకొని జీవిస్తున్న హరీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గీతకార్మికులు కోరుతున్నారు, తమ నుప్రభుత్వం తరుపున ఆదుకోవాలని కోరారు