హైదరాబాద్‌లో రంజాన్ పండుగ వేళ అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నపేగు మీద కనీస మమకారం లేని ఓ తల్లి..కన్న బిడ్డను చెత్త కుండీలో వేసింది. దాంతో ఆ శిశువు మృతదేహాన్ని (తొంటి నుంచి తొడ భాగాన్ని) కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన రామాంతపూర్ ప్రిన్స్ టన్ కాలేజ్ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. శిశువు చనిపోయాక గుర్తుతెలియని వారు చెత్త డబ్బాలో పారేసి వెళ్లినట్లు భావిస్తున్నారు.