Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో విషాద ఘటన.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..భర్త ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

హైదరాబాద్ లో విషాద ఘటన.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..భర్త ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, పిల్లల్ని హత్య చేసిన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన గణేశ్ న్యూ బోయిన్‌పల్లి‌లోని పెద్దతోకట్టలో తన భార్య స్వప్న, ముగ్గురు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా, దంపతుల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్య స్వప్న, 10 సంవత్సరాల కుమార్తె నక్షత్రను గొంతు నులిమి చంపి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత భర్త గణేశ్ రైలు కిందపడి భర్త గణేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మృతితో మిగిలిన ఇద్దరు చిన్నారులు అనాథయ్యారు. కాగా, బాధిత కుటుంబీకుల సమాచారం ప్రకారం.. వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్‌ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనట్లు సమాచారం. దీంతో భార్య, భర్తల మధ్య తరచూ మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేశ్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, బోయిన్‌ పల్లి పోలీసులు గణేశ్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img