ఇదేనిజం, రాయికల్: జూలై 1 అనగా రేపటి నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పి పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.*కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు – *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.* జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని తెలిపారు.