Homeజిల్లా వార్తలుగీతాంజలి హైస్కూల్లో ముగ్గుల పోటీలు

గీతాంజలి హైస్కూల్లో ముగ్గుల పోటీలు

ఇదే నిజం నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని గీతాంజలి హైస్కూల్​లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ గూడూరు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ వేములపల్లి సుబ్బారావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముగ్గుల పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి కుంజ శ్రీలేఖ మొదటి బహుమతి తవడబోయిన కవిత రెండో బహుమతి, దుమ్మల హైమావతి మూడో బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పండగల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వేములపల్లి సుబ్బారావు , ప్రిన్సిపల్ గూడూరు ప్రవీణ్ కుమార్, ఇన్చార్జి రాధా, పూర్ణచందర్, పవన్, రాజు, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img