Homeహైదరాబాద్latest Newsనీటికోసం అల్లాడుతున్న ఆదివాసీలు

నీటికోసం అల్లాడుతున్న ఆదివాసీలు

ఇదే నిజం, వేమనపల్లి : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని మల్కలపల్లి గ్రామంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్టీవార్డులో బోరు చెడిపోవడంతో గత 15 రోజులుగా నానాఅవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ కింద నల్లాలు ఇచ్చినా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన కనెక్షన్లలో కొన్ని లీక్ అవుతూ నీరు వృథా అవుతోందని వాపోతున్నారు. దగ్గర్లోని వాటర్‌ట్యాంక్‌కు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వకపోండంతో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారిందంటున్నారు. అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img