Homeహైదరాబాద్latest Newsవ్యవసాయ విస్తరణ అధికారులకు సన్మానం

వ్యవసాయ విస్తరణ అధికారులకు సన్మానం

ఇదేనిజం, ఎండపల్లి: ధర్మపురి నియోజకవర్గంలోని ఉమ్మడి వెల్గటూర్ మండలంలో గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారిగా, గొడిసెల పేట క్లస్టర్ లో విధులు నిర్వహిస్తూ రైతులందరితో స్నేహ భావంతో మెలిగి, రైతులందరి మన్ననలు పొంది మంగళవారం బదిలీపై వెళ్తున్న అయ్యోరి వినోద్ కు క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులంతా జ్ఞాపకను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.అలాగే క్లస్టర్ నూతన వ్యవసాయ విస్తరణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన బలిజపల్లి సందీప్ కు రైతులంతా పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గొడిసెలపేట వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులు, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img