Homeహైదరాబాద్latest Newsప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి - Ramoji Rao

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి – Ramoji Rao

ఇదేనిజం, బెజ్జంకి : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాప వ్యక్తం చేస్తూ ఆదివారం బెజ్జంకి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు. పత్రికా, వ్యాపార, సినిమా రంగాలకు రామోజీరావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పాత్రికేయ వృత్తిని అగ్రగామిగా నిలిపారని తెలిపారు. జర్నలిజంలో నూతన వొరవడిని సృష్టించి, ఆదర్శప్రాయుడిగా, మార్గదర్శిగా నిలిచారని, పత్రికా రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్, సీనియర్ పాత్రికేయులు మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img