ఇదేనిజం, అచ్చంపేట: ఉప్పునుంతల మండల తహసీల్దార్ గా బదిలీపై వచ్చిన తబితారాణి గారిని ఉప్పునుంతల మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎం బాలునాయక్, తాడూరు సర్పంచ్ అలివేల, దేవదారి కుంట సర్పంచ్ పర్వతాలు, లత్తిపూర్ సర్పంచ్ మల్లేశ్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి అభినందనలు తెలిపారు.