జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, ప్రజలు ఆయన విగ్రహానికి, ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళిత బహుజన వర్గాలకు దిక్సూచి అని కొనియాడారు. దళిత బహుజన జాతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జ్యోతిరావుపూలే వేడుకలు ఘనంగా జరిగాయి.


ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్


దేవరకొండ అంబేడ్కర్ చౌరస్తాలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, తదితరులు


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నివాళులు అర్పిస్తున్న సామాజిక ఉద్యమకారులు కొటారి నర్సింహులు, తదితరులు


నివాళులు అర్పిస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, తదితరులు


జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, తదితరులు


దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సంఘం నాయకులు, తదితరులు


దేవరకొండలో నివాళులు అర్పిస్తున్న డీవైజేఏసీ ఛైర్మన్ ఎర్ర కృష్ణ, తదితరులు


డిండి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు, కార్యకర్తలు


దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న స్థానిక నాయకులు


జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు


రామగిరి మండలం సెంటినరీ కాలనీలో పూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ మండల అధ్యక్షుడు మల్మూరి శ్రీనివాస్, తదితరులు