ఇదేనిజం, శేరిలింగంపల్లి : సంఘసంస్కర్త, మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ రిక్షా పుల్లర్స్ కాలనీలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివేకానంద డివిజన్‌కు సంబంధించిన వెంకటేశ్వర నగర్, మాధవరం కాలనీ, కమల ప్రసన్న నగర్, వివేకానంద నగర్, సుమిత్ర నగర్, బాగమీర్ కాలనీలలో ఇంటింటికి ప్రచారం చేస్తూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, కన్వీనర్ రాఘవేంద్రరావు, కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, డాక్టర్ నరేష్, కో- కన్వెన్షన్ కన్వీనర్ మణిభూషణ్, కేశవ్ , నర్సింగ్ యాదవ్,చారి, శ్రీ హరి యాదవ్, కమలాకర్ రెడ్డి ,గోపాల్ రావు పాల్గొన్నారు