HomeతెలంగాణTRS MUNUGODU:టీఆర్ఎస్ కు మునుగోడు అగ్ని పరీక్షే

TRS MUNUGODU:టీఆర్ఎస్ కు మునుగోడు అగ్ని పరీక్షే

TRS MUNUGODU:

మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ెస్ పార్టీకీ అగ్ని ప‌రీక్ష కానుంది. టీఆర్ెస్ పార్టీనీ ఇబ్బంది పెట్టేలా కుటిల ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీ , టీఆర్ెస్ ను ఎలాగైనా ఓడించాల‌న్న కాంగ్రెస్ పార్టీకీ ఇక్క‌డ ఓడితే పెద్ద‌గా న‌ష్టం ఉండ‌క‌పోవ‌చ్చు. టీఆర్ెస్ పార్టీ ప‌రిస్థితి భిన్నంగా ఉంటుంది. ఓడితే ప్ర‌మాదంలోకి నెట్టివేయ‌బ‌డుతుంది. రాబోయే ఎన్నిక‌ల మీద దీని ప్ర‌భావం బ‌లంగా ఉంటుంది.
ముందు నుయ్యి వెనుక గొయ్యి :
టీఆర్ెస్ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఈ స్థితికి నెట్టేసేందుకు బీజేపీ నాయ‌క‌త్వం ప‌క‌డ్బంధీ వ్యూహం ర‌చించి అమ‌లుకు పూనుకుంది. రాజగోపాల‌రెడ్డి రాజీనామా ద్వారా అనేక సంకేతాల‌ను పంపాల‌ని నిర్ణ‌యించి రాజీనామా చేయించింది. దీనిద్వారా ముందుగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయాల‌ని చూసింది. ఏక‌తాటిపైకి వ‌చ్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నిక‌ల్లో కోల్పోతే కాంగ్రెస్ ఖ‌తం అయింద‌న్న ప్ర‌చారంతో రాబోయే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌కు వెళ్లొచ్చ‌నేది ఒక ఆలోచ‌న‌. త‌ద్వారా కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌రుచ‌వ‌చ్చ‌ని, అదేవిధంగా రాష్ట్ర నాయ‌క‌త్వంత‌పై కాంగ్రెస్‌లో తిరుగుబాటు వ‌స్తుంద‌ని..అదే జ‌రిగితే కాంగ్రెస్‌ను న‌మ్మి ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌ర‌ని అంచ‌నా వేసింది. వాస్త‌వానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవ‌రి దారి వారిదే. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా చాలా దుకాణాలు వెలిసాయి. దీనిని వాడుకుని నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన ప‌లిచి కార్య‌క‌ర్తలు లేకుండా చేయాల‌న్న ఉద్దేశ్యం. ఇక టీఆర్ెస్‌ను టార్గెట్ చేసి పావులు క‌దుపుతున్న‌ది. క్షేత్ర‌స్థాయిలో టీఆర్ెస్ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చ‌క్రం తిప్పుతున్న‌ది. ఇప్ప‌టికే జీహెచ్ెంసీ ఎన్నిక‌ల నుంచి త‌గ్గుతున్న టీఆర్ెస్ గ్రాఫ్‌..దుబ్బాక , హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌తో మ‌రింత ప‌డిపోయింది. ఇదే క్ర‌మంలో బీజేపీ గ్రాఫ్ బ‌లంగా పెరుగుతున్న‌ది. ఇప్పుడు మునుగోడులో గ‌త ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూపెట్టి మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను బీజేపీ త‌మ‌వైపుకు తిప్పుకోనున్న‌ది. టీఆర్ెస్ బ‌లం త‌గ్గింద‌ని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌నుంది. ఒక వేళ మునుగోడు ఎన్నిక‌ల్లో గెలిస్తే టీఆర్ెస్ కు ఫ‌ర్లేదు కానీ ఓట‌మి పాలైతే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ెస్‌కు భారీ మూల్యం చెల్లించుకోక త ప్ప‌దు. టీఆర్ెస్ ఓడిపోయింది బ‌లం త‌గ్గిపోయింద‌ని ప్ర‌చారం చేసి ల‌బ్ధిపొంద‌డానికి బీజేపీ ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌దు. అప‌ర చాణ‌క్యుడిగా పేరొందిన కేసీఆర్ త‌న మేథ‌స్సుకు ప‌దును పెట్ట‌కుండా ఉంటాడ‌నుకోవ‌డం అవివేకం. మొత్తానికి మునుగోడు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఉప ఎన్నిక‌ల తీర్పు ఎలా ఉన్న టీఆర్ెస్ ఓట‌మి పాలైతే భ‌విష్య‌త్తుకు ఇబ్బంది అయ్యే అవ‌కాశ‌ముంది
ఓట‌ర్ల సంబురం
తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ప‌థ‌కాలు, డ‌బ్బ‌లు వ‌ర‌ద‌లా పారుతుంటాయి. మునుగోడులో కూడా డ‌బ్బుల వ‌ర‌ద పారుతుంద‌ని తెలిసి ప్ర‌తి ఒక్క‌రూ సంబుర ప‌డిపోతున్నారు. చోటా..మోటా నాయ‌కులు త‌మ‌కు మంచి బేరం కుదుర్చుకోవాల‌ని ఆశ‌తో ఉన్నారు. చూడాలి మ‌రీ…ఏం జ‌రుగుతుందో…

Recent

- Advertisment -spot_img