ఇదేనిజం, పెద్దపల్లి : హైదరాబాద్ మంచిర్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి పట్టణం బంధంపల్లి వద్ద కారు లారీని ఢీ కొట్టింది. గోదావరిఖనికి వెళ్తోన్న కారు అదుపుతప్పి లారీ ని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.