Homeహైదరాబాద్latest Newsఆర్టీసీతో ఆగమాగం..ఇప్పటికైనా!

ఆర్టీసీతో ఆగమాగం..ఇప్పటికైనా!

టీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొత్తచిక్కులు వచ్చి పడుతున్నాయి. బస్సులో ప్లేస్ లేక మహిళలు తిరగబడుతున్నారు.స్టేషన్లలో ఆపకుండా వెళ్తున్నందుకు పురుషులు దాడులు చేస్తున్నారు. డ్రైవర్లు, ఇతర సిబ్బంది పని ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మరోవైపు ఫ్రీ బస్ స్కీంకు ముందే బాగుండేదని పలువురు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఉచిత బస్సు అంటూ ఆగం చేశిళ్లు..అని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలంటున్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న నియామకాలను వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నారు.

అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్టీసీ సిబ్బంది, బస్సులపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఎండీ సజ్జనార్ రాకతో ఆర్టీసీలో కొంతమేర ఛేంజ్ కనిపించినా..ఫ్రీ బస్ స్కీంతో కొత్తచిక్కులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో ఓ బస్సును ధ్వంసం చేసిన వీడియోను ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాడులను సహించబోమన్నారు. తీవ్రంగా చర్యలుంటాయని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img