Homeఫ్లాష్ ఫ్లాష్TTD : శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత

TTD : శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత

–టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చిన భక్తులు


ఇదే నిజం, ఏపీ బ్యూరో: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత తిరుగుతున్నట్లు భక్తులు గుర్తించారు. పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను చూసినట్లు చెప్పారు. దీనిపై వారు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాలినడక భక్తులను టీటీడీ అధికారులు గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు. చిరుత సంచారంతో శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Recent

- Advertisment -spot_img