Homeఫ్లాష్ ఫ్లాష్TTDP:లాయర్ల ది సమాజంలో కీలక పాత్ర.- టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

TTDP:లాయర్ల ది సమాజంలో కీలక పాత్ర.- టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

TTDP:లాయర్లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ.. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న పోలీసు వ్యవస్థ..వారికి అనుకూలంగా మారుతుంది, ప్రతిపక్ష నాయకులు నిరసన, ధర్నా.. రాస్తారోకో.. లాంటి ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తే..ఈ లాంటి కార్యక్రమాలను చేస్తే పోలీస్ స్టేషన్లో వేసి బయబ్రంతులకు గురిచేస్తారు అలాంటి వాటి పై నిఘా ఉంచి బయటకు తీసుకురావాలన్నారు. అలాగే భూ వివాదం లాంటి.. అనేక రకాల కేసుల పరిష్కారం కోసం నిరంతరం లాయర్లు ప్రజల సమస్యల పరిష్కారం సులువుగా అయెందుకు మి కృషి ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ వెనక మీరు ఉంటే మి వెంట పార్టీ ఉంటుందని బరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగమైన రాష్ర్ట లీగల్ -సెల్ విభాగం నూతన కార్యవర్గ సభ్యుల ప్ర‌మాణాస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. లీగల్- సెల్ అధ్యక్షుడు గా రాఘవేంద్ర ప్రతాప్.. ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష్లులు కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్ విచ్చేశారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే, ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, ప్రధాన కార్యదర్శులు జక్కిని ఐలయ్య, బండారీ వెంకటేశ్వర్లు,రాష్ట్ర నాయకులు నీల పద్మావతీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జక్కీని ఐలయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా.. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..పార్టీ విజయం కోసం లాయర్ల పాత్ర ఎంతో కీలకం,ఎన్నికల సమయంలో చిన్న చిన్న సంఘటనలపై కేసులు నమోదు చేస్తారు వాటి పై అప్రమత్తంగా ఉండాలని నాయకులను చాకచక్యంగా విడిపించి తీసుకు రావాలని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న,119 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు వేసి పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. నూతనంగా లాయర్ వృత్తిలోకి వచ్చే యువతకు పార్టీ అనేక అవకాశాలు ఇస్తుంది.. న్యాయ వృత్తి లో మేధస్సును ఎంత పెంపొందించుకుంటే అంత మంచిదని ఈ వృత్తిని ఎంత నేర్చుకున్న తక్కువే అవుతుంది అన్నారు.నాడు అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కోసం ఈ పార్టీని నిర్మాణం చేసి..9 నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత ఎన్టీఆర్ అన్నారు..ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతో…2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కు..తెలుగు దేశం పార్టీ కి దక్కుతుందని గుర్తుచేశారు.చంద్రబాబు నాయుడు నవనిర్మాణ సమాజ అభివృద్ధి కోసం,నిరంతరం పోరాడే గోప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. యువత, కార్మికులు, ఉద్యోగులు.. టెక్నాజీ లో ఎలా ముందుకు వెళ్లాలో.. సలహాలు ఇచ్చే విజన్ ఉన్న నేత అన్నారు. అందరు కలిసి సమిష్టి గా ఉండి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని ఉద్ఘాటించారు.కార్యక్రమంలో పాల్గొన్న పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన లీగల్ సెల్ రాష్ట్ర కమిటి కి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే.. పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. లాయర్లు మా వెనక ఉంటే ..ఎలాంటి సంఘటన అయిన ఎదుర్కొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అన్నారు.రెండు డిప్లమాలు చదివి న్యాయ వృత్తి ని చేపట్టామన్నారు.ప్రజాస్వామ్య పరరక్షణకు లాయర్ల ది కీలక పాత్ర అన్నారు. ప్రజా స్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు లాయర్లు ముందు వరసలో ఉండాలని ఆమె సూచించారు.ఈ సందర్భంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ ..నాపై నమ్మకం ఉంచిన ఈ పదవిని కట్టబెట్టిన లీగల్ సెల్ కు రాష్ట వ్యాప్తంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు
రాష్ట్ర నాయకులు లీల పద్మవతి మాట్లాడుతూ… ప్రతి వారం, ప్రతి నెల..లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహించి. పార్టీ కి లీగల్ సెల్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img