HomeSocial MediaWGL: మరిపెడలో క్షుద్రపూజల కలకలం

WGL: మరిపెడలో క్షుద్రపూజల కలకలం

ఇదేనిజం, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో భోగి పండుగ పర్వదినం ఆదివారం రోజు రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. మరిపెడ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే జాతీయ రహదారి జంక్షన్ లో పదుల సంఖ్యలో కొబ్బరికాయలు, నిమ్మ కాయలు కోడిగుడ్లుతో పాటు గుమ్మడి కాయలు, పసుపు, కుంకుమలు, క్షుద్ర పూజకు ఉపయోగించే వస్తువులు పడివేశారు. దీంతో జాతీయ రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ పని ఇక్కడ వారు చేశారా..? లేక దూరప్రాంత వాళ్లు క్షుద్ర పూజల సామాగ్రిని ఇక్కడ పడేవేసి వెళ్లరా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదంటూ పోలీస్ అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img