Homeహైదరాబాద్latest Newsస్నానానికి వెళ్లి…మృత్యు ఒడిలోకి

స్నానానికి వెళ్లి…మృత్యు ఒడిలోకి

-మంజీరాలో ఇద్దరి మృతి
ఇదేనిజం, బాన్సువాడ : స్నానాలు చేయడానికి వెళ్లిన ఆ ఇద్దరు ప్రమాదావశాత్తు కాలు జారి మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామ శివారులో గల మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంజీరా నదిలో ఐదుగురు స్నానానికి వెళ్లగా సరదాగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతుల్లో న్యాంతాబాద్ పండరి(29) తో పాటు ఒక బాలుడు ఉన్నారు. పండరి మృతదేహం దొరకగా బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img