Homeతెలంగాణఅర్థరాత్రి ఘోరప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

అర్థరాత్రి ఘోరప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మోటార్ సైకిల్ రాంగ్ రూట్‌లో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులు మహారాష్ట్ర ముఖేడ్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img