Homeహైదరాబాద్latest Newsఉగాది స్పెషల్ ..

ఉగాది స్పెషల్ ..

Ugadi : ఉగాది అనగానే మెుదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీవితంలో సంతోషాలు ఎలా ఉంటాయో, దు:ఖాలు కూడా అంతే. ఉగాది పండుగ కుడా అదే విషయాన్ని చెబుతుంది. అయితే ఉగాది పచ్చడి చేసుకోవడంలో సాంప్రదాయం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరు రకాల రుచులు అనేక ఉపయోగాలను అందిస్తాయి. ఇందులో ఉపయోగించే బెల్లం, చింతపండు రసం, మామిడి, వేప, కారం, ఉప్పు.. అన్నీ మీకు మంచి చేసేవే. ప్రత్యేకంగా వేప, బెల్లం కలిపి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు పొందుతారు.ఉగాది రోజున కలిపి తీసుకునే బెల్లం, వేప పువ్వు మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న వివిధ రకాల విష పదార్థాలను తొలగించేందుకు ఈ హోం రెమెడీకి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వేపలో పెద్ద మొత్తంలో ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన టాక్సిన్స్‌ను తక్షణమే తొలగిస్తాయి. ఫలితంగా ఏ వ్యాధికి అవకాశం ఉండదు.

వేపలో ఉండే ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు కడుపులో ఉండే లెక్కలేనన్ని హానికరమైన సూక్ష్మజీవులను చంపుతాయి. ఫలితంగా, జీర్ణక్రియకు సంబంధించిన వివిధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
బరువు తగ్గాలని నిశ్చయించుకున్న వారు ఈ వేప, బెల్లం మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే ఈ ఔషధం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వును కాల్చే శరీర సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా కొవ్వు త్వరగా కరుగుతుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడి గ్యాస్ట్రోప్రొటెక్టివ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. ఇది కడుపు పుండు అవకాశాలను పూర్తిగా తగ్గిస్తుంది. కడుపు పూతలతో బాధపడుతున్న రోగులు కూడా దీనిని తీసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img