Homeహైదరాబాద్latest Newsయూకే కుటుంబ వీసా మరింత కఠినతరం

యూకే కుటుంబ వీసా మరింత కఠినతరం

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలంటే..అందుకు కనీస వార్షిక పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది. దీని గురించి యూకే సర్కారు గతేడాదే ప్రకటించగా..గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకనుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే..వారి కనీస వార్షిక వేతనం 29000 జీబీపీ (Great Britan Pound) లుగా ఉండాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img