ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని తేజవత్ రామసింగ్ శివారు, నల్లబోడు తండాకు చెందిన భూక్య సోమ, తండ్రి బాల్య అనే వ్యక్తిని తనకు ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని, అప్పు ఇచ్చిన భూక్య శ్రీనివాస్, అతనితో పాటు భూక్య బాసు, చించావత్ రమేష్, దారావత్ సంతోష్ లు సోమా ను, నిన్న మధ్యాహ్నం 03.00 గంటల ప్రాంతంలో, వీరి ఊరు అవమానించేలా తిట్టి, ముమ్మడిగా దాడి చేసి కొట్టగా, అట్టి అవమానం భరించలేక పురుగుల మందు తాగి చనిపోయినాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.