Homeహైదరాబాద్latest Newsనిండని చెరువులు.. ఎండుతున్న పంటలు..!

నిండని చెరువులు.. ఎండుతున్న పంటలు..!

ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం లో వర్షాలు లేక చెరువు లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అసలు జూలై మొదటి మాసం వరకు వర్షాలు బాగా కురిసేవి. కానీ వర్షాలు కురువక ఎండలు మండటంతో భూగర్భ జలాలు అడుగంటాయి. మళ్ళీ వర్షాలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదు. కావునా బావులు మరియు బోర్ల కింద సాగుచేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు వరి నార్లు పోసి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతులు ఇపుడు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 728 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 319 మీల్లి మీటర్ల వర్షం మాత్రమే నమోదు అయింది. గత ఏడాది ఆగస్టు నాటికి 1077 మీల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కావడంతో సాగు నీరు పూర్తి స్థాయిలో అందింది. ఈ ఏడాది వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని రైతులు వర్నె బాపురావు, పొరిక రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img