ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గూడెం వెళ్లి దారిలో ప్రాథమిక మండల పరిషత్ పాఠశాల లో గుర్తు తెలియని వ్యక్తులు సెలవు దినంలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన మంచినీటి నల్లాలను బండరాళ్లతో విరగ గొట్టి ఆ ప్రదేశంలో ధూమపానం డబ్బాలు ఉన్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘుపతి గ్రామ కార్యదర్శి కి అలాగే గ్రామ విలేజ్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. మళ్లీ పాఠశాల ఆవరణలో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.