Homeహైదరాబాద్latest Newsటీమిండియాకు అపూర్వ స్వాగతం.. కిక్కిరిసిన వాంఖండే స్టేడియం..

టీమిండియాకు అపూర్వ స్వాగతం.. కిక్కిరిసిన వాంఖండే స్టేడియం..

టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఫ్యాన్స్ అపూర్వ స్వాగతం పలికారు. ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్లేయర్స్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు కప్‌తో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వర్షం కురుస్తున్నా ర్యాలీ కొనసాగుతూనే ఉంది. బీచ్ రోడ్ అంతా జనంతో కిక్కిరిసిపోయింది. సాహో ఇండియా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

క్కిరిసిన వాంఖండే స్టేడియం:

టీమ్ ఇండియా టీ-20 వరల్డ్ కప్-2024 గెలిచిన సందర్భంగా బీసీసీఐ ముంబైలో విజయ యాత్రను నిర్వహిస్తోంది. రెండు గంటల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతరం వాంఖండే స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 35 వేల మంది అభిమానులు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు.

Recent

- Advertisment -spot_img