Homeహైదరాబాద్latest Newsఆగని ఇసుక దందా

ఆగని ఇసుక దందా

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్‌పల్లి మండలంలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోసిస్తున్నారు. రాత్రివేళల్లో ఇష్టారీతిన ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని చెప్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, పశువులకు కూడా తాగడానికి నీళ్లు దొరకట్లేదని వాపోతున్నారు. తరలించే క్రమంలో మూగజీవాలను ట్రాక్టర్లు ఢీకొడుతున్నాయని వివరించారు. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Recent

- Advertisment -spot_img