Homeహైదరాబాద్latest News‘అన్ స్టాపబుల్' టాక్ షో సీజన్-4 ట్రైలర్ రిలీజ్… అల్లు అరవింద్ వల్లే ఈ టాక్...

‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్-4 ట్రైలర్ రిలీజ్… అల్లు అరవింద్ వల్లే ఈ టాక్ షో చేశాను : బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’.. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ టాక్ షో నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపధ్యంలో టాక్ షో టీమ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తదితరులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. అల్లు అరవింద్ వల్లే తాను ఈ టాక్ షో చేస్తున్నానని వెల్లడించారు. నిజానికి అల్లు అరవింద్ కాకుండా మరెవరైనా అడిగితే ఈ షో చేసేవాడిని కాదన్నారు. ఇతర షోలు చేయమని చాలా మంది అడిగారని, వారందరికీ నో చెప్పానని బాలకృష్ణ తెలిపారు. అన్‌స్టాపబుల్ షో సందర్భంగా అందరం ఒక కుటుంబంలా కలిసిపోయామని బాలయ్య పేర్కొన్నారు. ఈ టాక్ షో సక్సెస్ కావడానికి సమష్టి కృషి ఫలితమే కారణమని వివరించారు.

Recent

- Advertisment -spot_img