US Gun Culture : అమెరికాలో వరుస కాల్పులు
US Gun Culture : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలవరపెడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా..మరో 25 మంది గాయపడ్డారు.
శుక్రవారం విస్కాన్సన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో ఓ బాస్కెట్ బాల్ స్టేడియంలో జరిగిన కాల్పుల్లో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం న్యూయార్క్ లోని బఫెల్లో ప్రాంతంలో ఓ సూపర్ మార్కెట్ లోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు..విచక్షణ రహితంగా ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈఘటనలో పది మంది పౌరులు అక్కడిక్కడే మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడి మరో ముగ్గురు మృతి చెందారు.
సూపర్ మార్కెట్లో కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. సైనికుడి వేషంలో తుపాకీతో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈఘటనలో ఒక నల్ల జాతీయుడిని ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుని విచారించగా..జాతి వివక్షతోనే కాల్పులు జరిపినట్టు దుండగుడు ప్రాధమిక విచారణలో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన పౌరుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన అధ్యక్షుడు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.