Homeజిల్లా వార్తలువీసీ, రిజిస్ట్రార్లను సస్పెండ్ చెయ్యాలి

వీసీ, రిజిస్ట్రార్లను సస్పెండ్ చెయ్యాలి

-అర్థాంతరంగా సెలవులు ప్రకటించడం అన్యాయం
-సెలవులు రద్దు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఎస్ఎఫ్ఐ కేయు యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన

ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కేయూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అర్ధాంతరంగా ప్రకటించిన సెలవులను రద్దు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి హతిరాం పాల్గొని మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్,రిజిస్ట్రార్ శ్రీనివాస్ లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెమినార్ ఉన్నందున హాస్టల్ విద్యార్థులకు ఈ నెల 23 నుండి సెలవులు ప్రకటించారని, హాస్టల్ గదులను సెమినార్ కు వచ్చే అతిథులకు కేటాయించారని, దీనివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. వెంటనే సెలవులను రద్దు చేసి, సెమినార్ కు వచ్చే అతిథులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. విద్యార్థుల పట్ల వీసీ, రిజిస్ట్రార్ లు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. వెంటనే వీసీ, రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేయూ కమిటీ సహాయ కార్యదర్శి స్టాలిన్,నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img