Homeమరిన్నిFide Master : ఫిడే మాస్టర్‌ టైటిల్‌ను పొందిన వేదాంత్‌ పనేసర్‌

Fide Master : ఫిడే మాస్టర్‌ టైటిల్‌ను పొందిన వేదాంత్‌ పనేసర్‌

Fide Master : ఫిడే మాస్టర్‌ టైటిల్‌ను పొందిన వేదాంత్‌ పనేసర్‌

Fide Master : చెస్‌ ఆటగానిగా ముంబైకు చెంది వేదాంత్‌ పనేసర్‌ అధికారికంగా ఫిడే మాస్టర్‌ (ఎఫ్‌ఎం) టైటిల్‌ గెలుచుకున్నాడు. 

విలేపార్లేలోని ఎన్‌ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్‌, 17  జాతీయ చెస్‌ చాంఫియన్‌షిప్‌లతో పాటుగా కామన్‌వెల్త్‌  కాంస్య పతకమూ గెలుచుకున్నాడు.

ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డెస్‌ ఇచెక్స్‌ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్‌ (ఎఫ్‌ఎం) టైటిల్‌ను  ప్రకటించింది.

గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం) మరియు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) టైటిల్స్‌ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది.

KFC Chicken : కేఎఫ్‌సీ చికెన్‌ బాక్స్‌ను తిందామని తెరిచిచూస్తే షాక్‌..

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

ఈ గుర్తింపు పొందడానికి ఆటగాళ్లకు అభిరుచితో పాటుగా ఆటలో స్థిరత్వం చూపుతూ అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన  ఫిడే రేటింగ్‌ పొందాల్సి ఉంటుంది.

ఎన్‌ఎం కాలేజీ విద్యార్ధిని అయిన వేదాంత్‌, చెస్‌ చాంఫియన్‌గా 2380 ఫిడే రేటింగ్‌ పొందాడు.

ఈ రేటింగ్‌ పొందడానికి ఎన్‌ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది.

వేదాంత్‌ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్‌ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషిస్తుంది.

ఈ కాలేజీ మద్దతు కారణంగానే అద్భుతమైన టైటిల్‌ను వేదాంత్‌ గెలుచుకున్నాడు. చెస్‌ పట్ల అమిత ఇష్టం కలిగిన వేదాంత్‌, రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లనున్నాడు.

Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..

Compensation : తన కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం

చెస్‌ పట్ల అమిత ఇష్టం కలిగిన వేదాంత్‌, ఇతరులకు సైతం ఈ గేమ్‌ నైపుణ్యాలను అందించేందుకు ముందుంటాడు.

లాక్‌డౌన్‌ సమయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది.

ఆ సమయంలో అతను ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించడంతో పాటుగా ప్రతిభావంతులైన నూతన ఆటగాళ్లకు తగిన ప్రోత్సాహమూ అందించాడు.

ప్రస్తుత మహమ్మారి కాలంలో అతనితో పాటుగా అతని బృందం ఈ కార్యక్రమం ద్వారా  లభించిన మొత్తాలను పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందించాడు.

వేదాంత్‌ ఇప్పుడు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌(ఐఎం) టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

Anand Mahindra : తుక్కుతో వాహనం.. ఎక్చ్సేంజీలో బొలెరో ఆఫర్‌

Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

Recent

- Advertisment -spot_img