Homeహైదరాబాద్latest Newsవీహెచ్ సంచలన వ్యాఖ్యలు… నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారు..

వీహెచ్ సంచలన వ్యాఖ్యలు… నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారు..

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో నాకు సీఎం పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదు. ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారు. నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారు. అయినా నాకు పదవులు లెక్క కాదు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదు. చచ్చేవరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే హెచ్ ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధిష్టానం వద్ద అనేకసార్లు మొరపెట్టుకున్నారు.. చివరకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img