Homeఅంతర్జాతీయంఅమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా

అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తనతో పాటు ఉపాధ్యక్ష పదవికి భారత మూలాలున్న కమలా హారిస్​ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ-జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. గతంలో కూడా ఆమె ఈ పదవి కోసం ప్రయత్నించారు. ఈ సారి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమె నిలవబోతున్నట్లు కొంత కాలం నుంచే వార్తలు వస్తున్నాయి. ఆమె గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ కూడా పని చేసిన అనుభవం ఉంది. కొద్ది రోజుల క్రితం అమెరికాలో నల్లజాతి వర్గ ప్రజల నిరసనలు జరిగినప్పుడు కూడా పోలీసులు నిగ్రహంతో ఉండాలని సమస్య పరిష్కారానికి కృషి చేశారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో బిడెన్ పోటీపడనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img