HomeEducationExams నిర్వహణ పట్ల అప్రమత్తత అవసరం

Exams నిర్వహణ పట్ల అప్రమత్తత అవసరం

ఇదేనిజం, గొల్లపల్లి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల విధులను నిర్వహించే అధ్యాపకులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (475)రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ లింగంపల్లి దేవేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆధారపడి ఉందని, పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని బోర్డు కృత నిశ్చయంతో ఉన్నదని అన్నారు. పరీక్ష విధులలో పాల్గొనే అధ్యాపకులు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా బోర్డు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకమని, ఇలాంటి ఇంటర్ మీడియేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నాణ్యతాయుత పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రతీ లెక్చరర్‌పై ఉన్నదన్నారు. ఆ దిశగా ప్రభుత్వ నిబంధల మేరకు అందరూ విధులను నిర్వహించాలని, పరీక్షల పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బలికాక తప్పదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కోశాధికారి జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img