Homeహైదరాబాద్latest News'పుష్ప-3 ది ర్యాంపేజ్' మూవీలో విజయ్ దేవరకొండ..! రష్మిక రియాక్షన్ ఏంటి..?

‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ మూవీలో విజయ్ దేవరకొండ..! రష్మిక రియాక్షన్ ఏంటి..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఆరు రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. అయితే ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటించనున్నాడు అని తెలుస్తుంది. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉందని ప్రకటించారు. ఆ క్రమంలో సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ 2022 లో ట్విట్ చేసాడు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. రష్మిక మాట్లాడుతూ.. ఆ విషయం మీకే కాదు నాకు కూడా తెలియదు. దర్శకుడు సుకుమార్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు.సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని రష్మిక మందన్న చెప్పింది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అని ఖరారు ఆయనట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img