విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన చిత్రం ‘మహారాజ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 12 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది.