Homeహైదరాబాద్latest Newsవిజయ సంకల్ప యాత్ర పోస్టర్​ విడుదల

విజయ సంకల్ప యాత్ర పోస్టర్​ విడుదల

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళ వారం విజయసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను బీజేపీ నేతలు సోమవారం అచ్చంపేటలో విడుదల చేశారు. విజయసంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిరెడ్డి వెంకట రమణ రెడ్డి హాజరుకానున్నారు. యాత్రా ప్రముఖ్ గా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, యాత్రా క్లస్టర్ ఇంచార్జ్ నాగర్ పార్లమెంట్ ఇంచార్జ్ బంగారు శృతి వ్యవహరించనున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో మరో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని చెప్పారు. లింగాల మండలం అంబట్​ పల్లి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమై అచ్చంపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహిస్తామన్నారు. బీజేపీ కార్యకర్తులు, ప్రజలు భారీ సంఖ్యలో ఈ యాత్రకు హాజరు కావాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img