– ఖర్గే సమక్షంలో చేరిక
ఇదే నిజం, హైదరాబాద్: ఇటీవల బీజేపీకి రిజైన్ చేసిన విజయశాంతి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గేను ఆయన బస చేసిన హోటల్ లో విజయశాంతి కలిశారు. అక్కడే పార్టీలో చేరిపోయారు. ఆమె రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారని అనుకున్నారు. కానీ అధికారికంగా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చేరాలి కాబట్టి ఖర్గే తో కండువా కప్పించుకన్నారు.