Homeహైదరాబాద్latest Newsగ్రామస్థులు ఆర్థిక సాయం అందజేత

గ్రామస్థులు ఆర్థిక సాయం అందజేత

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ దుమల్ల గంగయ్య గుండె పోటు వల్ల ఆకస్మికంగా ఇటీవల చనిపోగా గ్రామస్థులు 43200 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.రాఘవపట్నం, గంగాదేవిపల్లె గ్రామ ప్రజలు చందాల రూపకంగా 43200/- రూపాయలు జమ చేసి వారి యొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇటువంటి కార్యక్రమాలకు ఆపదలో వున్న కుటుంబాలకు రాఘవపట్నం మరియు గంగాదేవిపల్లె ప్రజలు చేయూత అందిస్తున్నారని వారి సహకారం మరువలేమని మాజీ వార్డ్ మెంబర్ చిటాల శ్రీకాంత్ అన్నారు. ఆర్థిక సాయం అందించిన వారందరికీ మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాగం శంకరయ్య,మాజీ ఎంపీటీసీ బుర్ర రాజేందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఒడ్నాల అంజయ్య, కాసారపు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img