ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే నివాసం స్థానిక మార్కెట్ యార్డ్ లో బుధవారం నాడు ఎమ్మెల్యే బాలు నాయక్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాలలో బీటీ రోడ్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు. ఇదంపల్లి గ్రామం నుండి ఎర్ర గుంటి పల్లి రెండు కోట్ల 70 లక్షలు, శాఖ వెళ్లి నుండి తిమ్మాపురం వరకు మూడు కోట్ల 15 లక్షలు తూర్పు పల్లి నుండి కొమ్మేపల్లి వరకు రెండు కోట్ల 18 లక్షలు వీరన్న గూడెం గ్రామం నుండి దిండి ప్రధాన రహదారి వరకు ఒక కోటి 25 లక్షలు కంబాలపల్లి నుండి యాల్లమల మంద గ్రామానికి 90 లక్షల రూపాయలు తక్కలపల్లి నుండి మోదుగుల మల్లేపల్లి నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు గాను 20 కోట్ల రూపాయలు , ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లోనూతన రోడ్లకు 25 కోట్ల రూపాయలు, ఎస్సీ సబ్ ప్లాన్ నుండి గ్రామాలలోని ఎస్సీ కాలనీలకు 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలనకు గ్రామాలు మసకబారిపోయాయని గ్రామాలలో రోడ్ల వ్యవస్థ అష్టవేష్టంగా ఉందని ఆయన అన్నారు. గత పాలకుల వివక్షతతో బడ్జెట్లో కేటాయించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పనులు చేయకుండానే స్వాహా చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో రాష్ట్రం మరింత నూతన అభివృద్ధి శాఖ పయనిస్తుందని వారు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామని వారు తెలియజేశారు. దేవరకొండ నియోజకవర్గం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గం చేస్తామని నల్లగొండ జిల్లాకు జలసిరి అయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండు సంవత్సరాల కాలంలో పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీలం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను లను అమలుపరుస్తున్నామని త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు డిజిటల్ రేషన్ కార్డులను ప్రజలకు అందజేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాను యాదవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ కాన్, మేకల శ్రీనివాస్, నాయిని మాధవరెడ్డి, తిప్పర్తి రూక్మ రెడ్డి కొర్ర రామ్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.