Homeక్రైంవినోద్​ ఇంట్లో సోదాలు

వినోద్​ ఇంట్లో సోదాలు

– భారత మాజీ క్రికెటర్​ శివలాల్​యాదవ్​, హెచ్​సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్​ ఇంట్లోనూ తనిఖీలు
– ఏసీబీ దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా సోదాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ బెల్లంపల్లి అభ్యర్ధి వినోద్‌ నివాసంలో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్‌ శివలాల్​యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరిగినట్లు సమాచారం. మంగళవారం వినోద్‌ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ సోదాలు నిర్వహించింది. వివేక్‌ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img