HomeEnglish'Vintage Brahmi' in Keeda Cola కీడా కోలాలో 'Vintage Brahmi'

‘Vintage Brahmi’ in Keeda Cola కీడా కోలాలో ‘Vintage Brahmi’

టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అంటే గుర్తొచ్చే మొట్ట మొదటి పేరు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. అయితే తాను ఇప్పటికే ఎన్నో వేల చిత్రాల్లో కనిపించి తెలుగు ఆడియెన్స్ ని నవ్వించారు. ఇప్పుడు చాలా తక్కువ చిత్రాల్లోనే ఆయన కనిపిస్తున్నారు.


ఇటీవల సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ లోనే కనిపించిన హాస్య బ్రహ్మ ఒక్క సినిమాతో మాత్రం తన వింటేజ్ టైమింగ్ తో ఫుల్ లెంగ్త్ లో అలరించనున్నారని తెలుస్తుంది. ఆ సినిమానే తాను నటించిన లేటెస్ట్ మూవీ ‘కీడా కోలా’. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ లో బ్రహ్మానందం కూడా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన వింటేజ్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. అది కూడా ఫుల్ లెంగ్త్ లో తాను కనిపించనున్నారట. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక సాలిడ్ ట్రీట్ అని చెప్పాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img