Homeజిల్లా వార్తలుశాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

– ఎస్సై అనుమల్ల నరేష్ కుమార్

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశంలో ఎస్సై అనుమల్ల నరేష్ కుమార్ మాట్లాడుతూ.. మండల పరిధిలో న్యూఇయర్ వేడుకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో, శాంతిభద్రకు లోబడి జరుపుకోవాలని అన్నారు. అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎసై హెచ్చరించారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 8 గంటల నుండి గొల్లపల్లి మండలంలో వివిధ స్థలాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img