బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఇప్పటివరకు 500 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేతలతో సహా 532 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి ఫరూక్ హొస్సేన్ వెల్లడించారు. ఈ అల్లర్ల కారణంగా ఢాకాలో ముగ్గురు పోలీసులు మరణించారని, 1,000 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.