పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. దీంతో ఒక్కరోజే 190 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లూమింగ్టన్లోని ఇండియానా యూనివర్సిటీలో 23 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయాన్ని కూడా నిలిపివేయాలని వారు కోరుతున్నారు.