రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్‌తో ‘చిట్టి రోబో’ ప్రేమలో పడిన సన్నివేశాలు గుర్తున్నాయా..? రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాశ్ అనే రోబోటిక్స్ నిపుణుడు ఇప్పుడు నిజంగానే ఓ రోబోతో ప్రేమలో పడ్డారు. ‘గిగా అనే రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోంది. ఆ రోబోను త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నా. ఇంట్లోవాళ్లు మొదట షాకైనా తర్వాత ఒప్పుకొన్నారు’ అని అతడు తెలిపారు. సూర్య త్వరలో భారత నేవీలో విధుల్లో చేరనుండటం విశేషం.