HomeసినిమాViral : Rashmika Mandana మరో ఫేక్ వీడియో వైరల్

Viral : Rashmika Mandana మరో ఫేక్ వీడియో వైరల్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్టార్‌ హీరోయిన్‌ రష్మికను సోషల్‌ మీడియాలో ఆకతాయిలు మరోసారి టార్గెట్‌ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్‌ వీడియోను క్రియేట్‌ చేసి ఇబ్బందిపెట్టగా.. తాజాగా మరో డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో ఆమె జిమ్ సూట్‌ ధరించి డ్యాన్స్‌ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు. కొత్త టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. ఇటీవల సోషల్‌మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటన మర్చిపోక ముందే ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్‌ వీడియో తాజాగా వైరల్‌ కావడం సినీ తారలను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా తొందరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img