హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో మందుబాబుల మధ్య గొడవ జరిగింది. పబ్‌లో యువతితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆకతాయిల దాడిలో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.