Homeహైదరాబాద్latest NewsVIRAL: ఇదేందయ్యా ఇది.. కాళ్లు క‌డిగి మ‌రీ పెన్ష‌న్ అంద‌జేసిన మంత్రి.. (VIDEO)

VIRAL: ఇదేందయ్యా ఇది.. కాళ్లు క‌డిగి మ‌రీ పెన్ష‌న్ అంద‌జేసిన మంత్రి.. (VIDEO)

ఏపీలో పెన్షన్ల పంపిణీ కోలాహలంగా సాగుతోంది. పేరుకి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తున్నా.. టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి అవ్వా తాతల్ని పలకరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో వారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొంటున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ల పంపిణీలో తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పాలకొల్లులో పెన్షన్ల పంపిణీ కోసం వెళ్లిన ఆయన లబ్ధిదారుల కాళ్లు కడిగి మరీ వారికి పెన్షన్ సొమ్ము అందజేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి కొంతమంది మంత్రి సార్ మీరు చాలా గ్రేట్ అంటున్నారు. మరికొందరు ఇది చాలా ఓవర్ అంత పబ్లిసిటీ కోసం మాత్రమే అంటున్నారు.

Recent

- Advertisment -spot_img