ఏపీలో ఎన్నికల హీటు ముగిసింది. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఏపీ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో మళ్ళీ పవన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనాని గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అది ఏంటంటే..ఎన్నికల హీట్ ముగియడంతో జగన్ విదేశాలకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నెలలో పవన్ విదేశాలకు వెకేషన్‌కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్తాడనే దానిపై క్లారిటీ లేదు. అలాగే కుటంబసమేతంగా వేళ్లారా సింగిల్‌గా వెళ్లార అనే విషయం కూడా తెలియరాలేదు. కానీ దాదాపు నెల రోజుల పాటు పవన్ విదేశాల్లో గడిపి జూన్ మధ్యలో తిరిగి వస్తారనేది టాక్. పవన్ వచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.