Homeహైదరాబాద్latest NewsVirat Kohli in New york : న్యూయార్క్ వీధుల్లో కోహ్లీ దంపతులు

Virat Kohli in New york : న్యూయార్క్ వీధుల్లో కోహ్లీ దంపతులు

Virat Kohli in New york

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ సిటీ న్యూాయార్క్‌ వీధుల్లో కలియతిరిగారు. తన భార్య అనూష్క శర్మతో కలిసి షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. కాగా ఈరోజు రాత్రి 8 గం.లకు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే పూనకాలు వచ్చినట్లు చెలరేగిపోయే కోహ్లీ ఈరోజు సీన్ రిపీట్ చేస్తాడా? 2022టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. పాక్ విధించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా నేనున్నానంటూ ఇన్నింగ్స్ చివరి వరకూ పోరాడి గెలిపించిన తీరు సగటు క్రికెట్ అభిమాని గుండెలో చిరకాలం ఉంటుంది.

Recent

- Advertisment -spot_img